కరోనా నియంత్రణలో టాప్ లేపిన AP

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికంగా శాంపిల్స్ పరీక్షించడమే అందుకు కారణమని తెలిసిందే. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కోవిడ్19 టెస్టుల ప్రక్రియను వేగవంతం చేసింది.

Last Updated : May 25, 2020, 12:01 PM IST
కరోనా నియంత్రణలో టాప్ లేపిన AP

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికంగా శాంపిల్స్ పరీక్షించడమే అందుకు కారణమని తెలిసిందే. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కోవిడ్19 టెస్టుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది.  వివాహేతర సంబంధం.. చిన్నారి సహా 9 మంది హత్య

5  కోట్ల జనాభా కలిగిన 10 పెద్ద రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 65.82 శాతం రికవరీ రేటుతో మిగతా రాష్ట్రాలకు అందనంత దూరంలో ఏపీ ఉంది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తు్న్న 3టీ (Tracing, Testing, Treating) ఫార్ములానే కారణమని వైఎస్సార్ సీపీ తమ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

Image Credit: Twitter/YSRCP

మరోవైపు ఇన్‌ఫెక్షన్ రేటు లోనూ 0.92శాతంతో 5 కోట్ల జనాభా రాష్ట్రాలలో అతి తక్కువ కరోనా వ్యాప్తి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఏపీ తర్వాత యూపీలో రికవరీ రేటు 56.61శాతంగా ఉంది. అతి తక్కువ ఇన్‌ఫెక్షన్ రేటులో ఏపీ తర్వాతి స్థానంలో కర్ణాటక 1.01శాతంగా కరోనా సమర్థవంతంగా ఎదుర్కుంటోంది. కాగా, ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2600 దాటగా, 56 మంది కరోనా కాటుకు బలి కావడం గమనార్హం.    మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News