APEAPCET 2023 Counselling: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాల్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపట్నించి ప్రారంభం కావల్సిన వెబ్ ఆప్షన్ల ఎంపిక షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీఈఏపీసెట్ 2023 అడ్మిషన్ల షెడ్యూల్ మారింది. ఆగస్టు 3 అంటే రేపట్నించి జరగాల్సిన వెబ్ ఆప్షన్ల ఎంపిక తేదీ ఇతర ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. వాస్తవానికి ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ ఎంపిక ఉంటుంది. 9వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 12వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. కానీ ఇప్పుడు మారిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకూ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. ఆగస్టు 13వ తేదీ ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇక ఆగస్టు 17న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన క్లాసులు ప్రారంభం కానున్నాయి. అయితే రిజిస్ట్రేషన్, ప్రోసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు.
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023కు 3,14,797 మంది హాజురు కాగా 2,52,717 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,71, 514 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది అర్హత సాధించారు.
ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫీజులకు సంబంధించి కనిష్టంగా 42,500 అంతకంటే ఎక్కువ ఫీజులుంటే 10 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ ఫీ రెగ్యులేటరీ కమీషన్ 2023-24 నుంచి మూడేళ్ల కాలానికి కొత్త పీజులు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
Also read: Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు ఆగస్టు 6 వరకూ భారీ వర్షాలు<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook