NTR Jyanthi: ఎన్టీఆర్‌ ఫోటోతో వంద రూపాయ నాణెం! తారకరాముడికి ఘనంగా నివాళులు

NTR Jyanthi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 10:41 AM IST
  • ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
  • నిమ్మకూరులో బాలకృష్ణ నివాళి
  • త్వరలో ఎన్టీఆర్‌ ఫోటోతో రూ. వంద నాణెం
NTR Jyanthi: ఎన్టీఆర్‌ ఫోటోతో వంద రూపాయ నాణెం! తారకరాముడికి ఘనంగా నివాళులు

NTR Jyanthi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అన్నగారి అభిమానులు నివాళి అర్పించారు. ఉదయమే ఎన్టీఆర్ ఘాట్‌ కు వచ్చారు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌. తారకరాముడి  సమాధి దగ్గర పులమాలలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురందేశ్వరి.. ఎన్టీఆర్ ఒక సంచలనం అన్నారు. ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు జరుపుతామని చెప్పారు. వచ్చే ఏడాది మే 28న ముగింపు వేడకను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణలోని 12 కేంద్రాల్లో వేడుకలు ఉంటాయని పురందేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. వేడుకల్లోనే వివిధ రంగాల్లో ప్రముఖులను గుర్తించి ఘనంగా సన్మానిస్తామన్నారు. ఎన్టీఆర్‌ ఫోటోతో వంద రూపాయల నాణం ముద్రణపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

ఇక తన తండ్రికి ఘనంగా నివాళి అర్పించారు హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరుకు వెళ్లారు బాలయ్య. గ్రామస్తులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారు చిరస్థాయిలో నిలిచిపోయారని బాలకృష్ణ అన్నారు.తెలుగు జాతి ఆత్మగౌరవ పోరాటం చేసిన ఎన్టీఆర్.. పేదల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు.ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ.

READ ALSO: NTR Centenary Celebrations: ఎన్టీఆర్ కు జూనియర్ నివాళి.. నందమూరి ఫ్యామిలీ ఏకమవుతుందా? మహానాడుకు వెళతారా?

READ ALSO: KCR DELHI POLITICS: దసరా తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ మకాం! కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News