Ys Jagan Strategy: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇవాళ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. బీజేపీ వైఖరి స్పష్టం కాకపోగా, టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైంది. తాజాగా వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
ఏపీలో వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దాదాపుగా నెరవేర్చిన జగవ్ అదే అస్త్రంగా ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఒంటరి పోరాటమా లేక టీడీపీ-జనసేనతో కలిసి ప్రయాణం చేస్తుందా అనేది ఇంకా తేలలేదు. మరోవైపు వైఎస్ షర్మిల సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఖరారు కాలేదు గానీ టీడీపీ ప్రకటించిన మినీ ఎన్నికల మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని తెలుస్తోంది. దీనికితోడు చంద్రబాబు చెప్పింది ఏదీ చేయరని గత ఉదాహరణలు ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు.
ఎన్నికల వేళ కొత్తగా రెండు వరాలు
ఇప్పుడు తాజాగా మరో రెండు వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను 3 వేలు చేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలో వస్తే 4 వేల వరకూ చేసే హామీ ఇచ్చేందుకు జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నారు. ఇక రైతులకు రుణ మాఫీ అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రుణమాఫీ హామీపై సమాలోచన చేస్తోందని సమాచారం. భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కాబట్టి ఒకవేళ హామీ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎంతమేరకు మాఫీ చేయవచ్చు, ఎంత భారం పడుతుందనే అంశాల్ని పార్టీ యంత్రాంగం పరిశీలిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ముందుగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. 2019లో అధికారంలో వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఫిబ్రవరి నాటికి చెల్లింపులు చేసేట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఐఆర్‌పై ప్రకటన చేయవచ్చని సమాచారం. ఈ మూడింటిపై నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు లాభించవచ్చని అంచనా.
Also read: AP Voters Final List 2024: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook