అమరావతి కరకట్టకు దగ్గరలో ఉన్న సీఎం నివాసానికి కొంచెం దూరంలో శుక్రవారం నాడు ఒక కారు దగ్ధమైంది. వివరాలోకెళ్ళితే గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు మిత్రులు కలసి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో వస్తున్న క్రమంలో కరకట్ట మార్గాన్ని దాటారు. ఈ క్రమంలో స్థానిక గెస్టు హౌస్ సమీపంలోకి రాగానే కారు వెనక భాగంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వలన ప్రేలుడు సంభవించింది. ఇది గమనించిన డ్రైవింగ్ సీటులోని వ్యక్తి కరకట్ట పైనే కారుని నిలిపివేసి, మిత్రులతో కలిసి దిగిపోయాడు. అప్పటికే మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
ఆ ఘటనను చూసిన స్థానికులు బకెట్లతో నీళ్ళు తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కొందరు స్థానికులు దగ్గరలోని సీఎం నివాసంలోని అధికారులకి సమాచారం అందించారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్‌కి కబురుపెట్టి మంటలు ఆపడానికి ప్రయత్నించారు.అర్బన్ ఎస్పీ విజయరావు కొద్ది నిమిషాలలోనే సంఘటన ప్రాంతానికి ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు.