AP: హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ కు కేంద్రం పచ్చజెండా

పారిశ్రామికంగా వృద్ధి సాధించేందుకు ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవకాశం దక్కింది. తాజాగా హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఖ్యాతిగాంచింది.

Last Updated : Oct 29, 2020, 10:03 PM IST
  • హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ కు కేంద్రం పచ్చజెండా
  • ఇప్పటికే రాశ్ట్రంలో విశాఖ -చెన్నై కారిడార్, చెన్నై-బెంగుళూరు కారిడార్లు
  • రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతే ప్రభుత్వ లక్ష్యం
AP: హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ కు కేంద్రం పచ్చజెండా

పారిశ్రామికంగా వృద్ధి ( Industrical growth ) సాధించేందుకు ఏపీ ప్రభుత్వానికి ( Ap Government ) అరుదైన అవకాశం దక్కింది. తాజాగా హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ ( Hyderabad- Bangalore corridor ) కు కేంద్రం ( Central government ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఖ్యాతిగాంచింది.

నవ్యాంధ్రప్రదేేశ్ ( Andhra pradesh ) ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ( Basic infrastructure facilities ) కు పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే రాష్ట్రంలో విశాఖ - చెన్నై కారిడార్‌, చెన్నై- బెంగళూరు కారిడార్లున్నాయి. తాజాగా హైదరాబాద్‌ - బెంగళూరు కారిడార్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు ( Three Industrical corridors in ap ) సాధించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో భాగంగా మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. 

ఈ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఆధీనంలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ ( నిక్‌డిట్‌ ) నుంచి పెద్దఎత్తున నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. Also read: AP: నవంబర్ 2 నుంచే స్కూల్స్, కాలేజీలు ప్రారంభం, షెడ్యూల్ విడుదల

విశాఖ-చెన్నై కారిడార్ ( Visakha - chennai corridor ) ‌ను 4 వేల 598 కోట్ల ఆసియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రుణంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖఫట్నంలో అచ్యుతాపురం - రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు - శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ పనుల కోసం 165 కోట్లు అదనంగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగానే మెడ్‌టెక్‌ జోన్‌ రెండవ దశ పనుల్ని చేపడుతున్నారు.

కొప్పర్తి తొలిదశలో 4 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సోమశిల ప్రాజెక్టు నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం డీపీఆర్‌ ( DPR ) తయారు చేస్తోంది. ఇక కృష్ణపట్నంను 2 వేల 5 వందల ఎకరాల్లో 15 వందల కోట్లతో ఈ పనులు చేపట్టారు. ఇక శ్రీకాళహస్తి క్లస్టర్‌ను నిక్‌డిట్‌ నిధులతో 8 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నక్కపల్లి  క్లస్టర్ ను విశాఖ - చెన్నై కారిడార్‌లో భాగంగా వేయి ఎకరాల్లో.., నిక్‌డిట్‌ నిధులతో మరో 3 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఓర్వకల్లు క్లస్టర్ ను కొత్తగా మంజూరైన హైదరాబాద్‌ - బెంగళూరు కారిడార్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ క్లస్టర్ అభివృద్ధిని నిక్‌డిట్‌ నిధులతో చేపట్టడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. దాదాపు 7 వేల ఎకరాల్లో ఈ క్లస్టర్ ను అభివృద్ధి చేస్తున్నారు. 

మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి సంస్థలు సూచించాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ వంటి రంగాల అబివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. Also read: AP: పోలవరంపై ఇంప్లీడ్ పిటీషన్ వేసి కేసు వాదిస్తాను: ఉండవల్లి

Trending News