Nuclear reactors in AP: ఏపీలో 6 న్యూక్లియర్​ రియాక్టర్స్​: రాజ్యసభలో కేంద్ర మంత్రి!

Nuclear reactors in AP: శ్రీకాకుళంలో న్యూక్లియర్ రియాక్టర్స్​ నెలకొల్పే అంశంపై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఆరు రియాక్టర్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 12:16 PM IST
  • ఏపీలో కొత్త న్యూక్లియర్ రియాక్టర్లపై కేంద్రం కసరత్తు
  • శ్రీకాకుళంలోని కొవ్వాడలో నెలకొల్పేందుకు ప్రణాళికలు
  • రాజ్య సభకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి
Nuclear reactors in AP: ఏపీలో 6 న్యూక్లియర్​ రియాక్టర్స్​: రాజ్యసభలో కేంద్ర మంత్రి!

Nuclear reactors in AP: ఆంధ్రప్రదేశ్​లో భారీగా న్యూక్లియర్​ రియాక్టర్స్​ నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రియాక్టర్లను నెలకొల్పనున్నట్లు తెలిసింది.

ఒక్క రియాక్టర్​ను 1208 మెగా వాట్స్​ విద్యుత్​ ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి (పర్సనల్​, పబ్లిక్​ గ్రేవియన్స్​ అండ్ పెన్షన్స్​) డాక్టర్​ జితేంద్ర సింగ్​ రాజ్య సభకు గురువారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

వైఎస్​ఆర్​ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు జితేంద్ర సింగ్​.

ఇంకా ఏం చెప్పారంటే..

ఈ రియాక్టర్లు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో నెలకొల్పనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన్ని రియాక్టర్లు కలిపి 7248 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేశారు. అమెరికా సహాయంతో ఈ రికాక్టర్లను నెలకొల్పనున్నట్లు వివరించారు.

అయితే ఈ రియాక్టర్లను నెలకొల్పే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఇందుకోసం ఎంత ఖర్చు చేయనున్నారు అనే వివరాలపై స్పష్టత రాలేదు.

అయితే కొవ్వాడలో రియాక్టర్లు నెలకొల్పే అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఈ విషయంపై చర్చ సాగుతోంది. పదేళ్ల క్రితమే 2 వేల ఎకరాల భూమిని ఎదుకోసం సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. 450 ఎకరాల సేకరణ పూర్తయింది కూడా. అయితే స్థానిక మత్స్యకారులు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనితో ఈ ప్రాజెక్టు కాస్త వాయిదా పడుతూ వస్తోంది.

Also read: AP PRC Issue: పీఆర్సీ వివాదం పరిష్కారం దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల చర్చలు!

Also read: Tirumala Updates: ఫిబ్రవరి 15 తర్వాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News