అనంతపురంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్

అనంతపురంలో కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు.

Last Updated : Aug 5, 2018, 07:14 PM IST
అనంతపురంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్

అనంతపురంలో కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. ఈ ఏడాదిలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 902 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించేవరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లో తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనంతపురం పర్యటనకు వచ్చారు. అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ సమీపంలో కేంద్రీయ విద్యాలయం తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో రాజకీయాలు ఉండవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుందని.. ఏపీకి కేటాయించిన ఏడు యూనివర్సిటీలకు కేంద్రం వందల కోట్ల రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్ర విభజన సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని.. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అసత్యాలని జవదేకర్ అన్నారు.

కేంద్ర మంత్రివన్నీ అబద్ధాలు: గంటా

కేంద్ర మంత్రివన్నీ అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ తరగతులను ప్రారంభించిన కేంద్ర మంత్రి  చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. కేంద్రం ఏపీని ఆదుకోవడం లేదని, అన్యాయం చేస్తోందని చెప్పారు. కేంద్ర నిధుల్లో కేవలం పది శాతం మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు.

Trending News