బీజేపీ మంత్రులపై చంద్రబాబు ప్రశంసలు !

Updated: Mar 8, 2018, 12:15 PM IST
బీజేపీ మంత్రులపై చంద్రబాబు ప్రశంసలు !

ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతూ రాజీనామా సమర్పంచిన ఇద్దరు బీజేపీ మంత్రులపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇద్దరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని వారిని అభినందించారు. కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని... దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దేవదాయ శాఖ ఆదాయం పెరిగేలా మాణిక్యాలరావు కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.