విభజన హామీల అమలు విషయంలో కేంద్రం ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ..ఇప్పుడు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని ..ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలని బాబు సూచించినట్లు తెలిసింది. పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు ఇలా హితభోద చేశారు.
గతంలోనూ ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ..రెండో సారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అపట్లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనతో అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశం రాలేదు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా వ్యవహరించాలనే దానిపై టీడీపీ నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. చంద్రబాబు వ్యూహం పార్లమెంట్ లో పనిచేస్తుందా లేదా అన్నది తేలాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.