విశాఖ ఎపిసోడ్ అనంతరం విజయవాడ నోవాటెల్ హోటల్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరి బంధంపై ఇప్పటివరకూ ఉన్న తెర దాదాపుగా తొలగిపోయింది.
విశాఖ నోవాటెల్ హోటల్ నుంచి విజయవాడ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు..టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఊహించని స్పందన ఎదురైంది. ముందస్తు సమాచారం లేకుండా..నేరుగా చంద్రబాబు నాయుడు విజయవాడ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కాస్సేపు మాట్లాడిన అనంతరం ఇరువురూ కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
నాగరిక ప్రపంచంలో విశాఖలో జరిగిన తీరు చూస్తుంటే బాధేస్తోందని..పవవ్ కార్యక్రమంలో పోలీసుల తీరు బాధాకరమని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని..ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసే స్థితికి వచ్చేశారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు ప్రాధాన్యతే ఉండదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి నీచమైన పార్టీని ఎన్నడూ చూడలేదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కలిసి రావాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని..ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. బయటికొచ్చి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరెలా పోటీ చేస్తానేది అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్‌కు తిట్లు తినే అలవాటు లేదని..రాజకీయాల్లో వచ్చి తిట్లు తింటున్నారని చంద్రబాబు చెప్పారు.
ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనేది ఒక్కరోజులే తేలే విషయం కాదన్నారు. వైసీపీతో కలిసి పోరాటం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని...న్యాయపరంగా , రాజకీయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేకూర్చడమే తమ ఉద్దేశ్యమన్నారు.
Also read: Heavy Rains Alert: ఏపీలో మూడ్రోజుల వరకూ భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook