అలా అయితే.. టీడీపి తడాఖా ఏంటో చూపిస్తా: సీఎం జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక

నీ అధికారం అంతు తేలుస్తాను: సీఎం జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక

Last Updated : Sep 10, 2019, 11:27 PM IST
అలా అయితే.. టీడీపి తడాఖా ఏంటో చూపిస్తా: సీఎం జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపి అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''మీ బాబాయ్‌ని చంపినట్టు జనాన్ని చంపినా అడిగే దిక్కు ఉండదనుకుంటున్నారేమో. అందరిని చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామనుకుంటున్నారా అని జగన్‌ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ తమాషా చేస్తే టీడీపీ తడాఖా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించిన చంద్రబాబు... నీ అధికారం అంతు తేలుస్తాను అంటూ వైఎస్ జగన్‌ని హెచ్చరించారు. మంగళవారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. మేము ఏమైనా చేస్తాం.. మాకు అడ్డేలేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు కానీ వైసీపీ తమాషా చేస్తే టీడీపి తడాఖా ఏంటో చూపిస్తామని చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా 'ఛలో ఆత్మకూరు' నిరసన కార్యక్రమం గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. 545 మందిని గ్రామాల నుంచి వెలేస్తే అది చిన్న సమస్యా అనుకోవాలా?.  అమ్మాయిని వివస్త్రను చేసి కారం చల్లుతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చూస్తోంటే.. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడా అనిపిస్తోంది అని సందేహం వ్యక్తపరిచారు. అందుకే ఛలో ఆత్మకూరు కార్యక్రమం ఆగదని స్పష్టంచేశారు. 127 ఎస్సీ కుటుంబాలపై వైసీపీ నేతలు అమానుషంగా ప్రవర్తించారు. కనీసం చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు. తమకు న్యాయం చేయండని బాధితులు రోడ్డెక్కితే.. వారిని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా అని వైసీపి సర్కార్‌ని నిలదీశారు. ఛలో ఆత్మకూరు నిరసన కార్యక్రమం ద్వారా బాధితులకు భరోసా ఇద్దామని ప్రయత్నిస్తే.. కౌంటర్‌ ర్యాలీలు చేపట్టి 144 సెక్షన్లు ఎందుకు విధిస్తున్నారు అంటూ జగన్ సర్కార్‌ని చంద్రబాబు నిలదీశారు.

Trending News