ఇకనైనా స్పందించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి చంద్రబాబు లేఖ

ఇకనైనా స్పందించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి చంద్రబాబు లేఖ

Last Updated : Sep 1, 2019, 07:29 PM IST
ఇకనైనా స్పందించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి చంద్రబాబు లేఖ

అమరావతి: వరదల నియంత్రణలో పూర్తి వైఫల్యం చెందిన ఏపీ సర్కార్ బాధితులను ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించిందని మాజీ సీఎం, టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు.. సీఎం ఇకనైనా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి ప్రజలకు నష్టం చేయడాన్ని బాధితులు సైతం ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. గోదావరి వరదలు మిగిల్చిన నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తిచేసి కేంద్రానికి నివేదిక పంపాలని చంద్రబాబు సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాలను వరదలు ముంచెత్తడంతో అక్కడి ప్రజల దుస్థితి చూస్తే చాలా బాధేసిందన్న చంద్రబాబు... అరటి, పసుపు, కంద, తమలపాకు, మొక్కజొన్న, వరి, చెరకు పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు వరదల ధాటికి పలు చోట్ల ఇళ్లు సైతం దెబ్బతిన్నాయని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఇళ్లు కోల్పోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలని, లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రుణమాఫీకి సంబంధించిన 4, 5 విడతల బకాయిలను వెంటనే చెల్లించాలని చంద్రబాబు ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

Trending News