అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్‌కి చెందిన గెస్ట్‌హౌజ్‌కు సీఆర్‌డీఏ అధికారులు శనివారం మరోసారి నోటీసులు జారీచేశారు. లింగమనేని రమేశ్ పేరిట ఉన్న గెస్ట్‌హౌజ్ గోడకు ఆయన పేరుపైనే అధికారులు నోటీసులు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించారంటూ లింగమనేని రమేశ్ గెస్ట్‌హౌజ్‌కు గతంలోనే నోటీసులు జారీ చేయగా.. అప్పట్లో ఆయన సంబంధిత అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే, లింగమనేని వివరణ పట్ల సంతృప్తి చెందని సీఆర్‌డీఏ అధికారులు.. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయడమే కాకుండా.. వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని అందుల్లో పేర్కొన్నారు.
లింగమనేని గెస్ట్ హౌజ్‌లో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్ డ్రెస్సింగ్ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఆర్‌డిఏ అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌డిఏ నోటీసులకు ఈసారి లింగమనేని ఏమని స్పందిస్తారోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి మళ్లీ నోటీసులు