నేతన్నలకు జగన్ సర్కారు శుభవార్త...ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24వేలు!

వైఎస్సార్​ నేతన్న నేస్తం మూడో విడత నిధులను ఇవాళ సీఎం జగన్​ విడుదల చేయనున్నారు. 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 192 కోట్లు నేరుగా జమకానున్నాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2021, 10:39 AM IST
  • నేడు చేనేతలకు ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’
  • వరుసగా మూడో ఏడాది అమలు
  • ఒక్కొక్క అకౌంట్‌లో రూ.24వేలు
నేతన్నలకు జగన్ సర్కారు శుభవార్త...ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24వేలు!

YSR Nethanna Nestham: వైఎస్సార్‌ నేతన్న నేస్తం’అమలుకు జగన్ సర్కారు సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్‌(CM Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. 

మగ్గం ఉండి.. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని(Third installment assistance) అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది. 

Also Read: రైతులకు శుభవార్త....పీఎం-కిసాన్ నిధులు విడుదల..చెక్ చేసుకోండి ఇలా!

చేనేత కుటుంబాలకు(handloom families) పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్‌ నేతన్న నేస్తం(YSR Nethanna Nestham) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వాలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్‌ ఆడిట్‌(Social Audit) చేపట్టింది. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News