YSR Rythu Bharosa Payment Status Online: రైతులకు జగన్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా -పీఎం కిసాన్ నిధులను రేపు లబ్ధిదారుల అకౌంట్లోని జమ చేయనుంది. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు. రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్న బహిరంగ సభలో జమ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా రైతు భరోసా కింద రూ.13,500 రైతు భరోసా సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.2,204.77 కోట్లతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం సాయం మాత్రమే రూ.33,209.81 కోట్లు అని అధికారులు తెలిపారు. ఐదో ఏడాది ఇప్పటికే మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం ప్రభుత్వం ప్రభుత్వం అందించిందని.. మంగళవారం అందిస్తున్న రూ.4 వేల సాయంతో కలిపి కేవలం ఒక్క రైతు భరోసా-PMKISAN పథకం ద్వారా మాత్రమే ఇప్పటి వరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం రూ.65,500 అవుతుందని చెప్పారు.
ఏటా 3 విడతల్లో రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్-నవంబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం రబీ ఆవసరాల కోసం రూ.4 వేలు, పంట ఇంటికి వచ్చే సమయంలో అంటే.. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో రూ.2 వేలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ 53 నెలల్లో రైతన్నలకు అందించిన మొత్తం సాయం రూ.1,75,007 కోట్లు అని అధికారులు వెల్లడించారు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి