టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ రమేశ్‌తో రాజీనామా చేయించాలని అన్నారు. రాజీనామా చేయించకుంటే సీఎం రమేశ్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మనిషి అనే ముద్ర పడుతుందన్నారు. సీఎం రమేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడని, సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే పన్నులు ఎగ్గొట్టారన్నారని.. టీడీపీ పార్టీ అతన్ని మార్చాలన్నారు. లేకపోతే తాను పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ సీఎం రమేష్‌కు లేవని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్ చేస్తారని ప్రశ్నించారు. సీఎం రమేశ్ స్పష్టమైన సమాధానాలు చెప్పాలని, లేకపోతే ఈ మచ్చ చంద్రబాబు, టీడీపీ పార్టీపై పడుతుందన్నారు. దొంగ దీక్షలు చేసిన సీఎం రమేశ్... తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం రమేష్ అంటే చంద్రబాబు మనిషి అని.. ఇదే ఆయనకు రాజ్యసభ సభ్యుడు అవ్వడానికి కారణమన్నారు. రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టి దొంగ దీక్షలు చేశారని.. తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.
తక్షణమే చంద్రబాబు రమేశ్‌ను పెద్దల సభ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు.
CM Ramesh should resign his Rajya Sabha membership. We demand TDP to force him to resign. CM Ramesh is said to be CM's Ramesh. He is a member in public accounts committee. TDP should change him. Otherwise I'll complain to parliament ethics committee: GVL Narasimha Rao, BJP pic.twitter.com/caNBLiv8YM
— ANI (@ANI) October 19, 2018