Ap Corona Update: మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా ( Corona ) విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ 7-10 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న 7 వేల కేసులు నమోదవగా...తాజాగా 9 వేల కేసులు నమోదయ్యాయి.

Last Updated : Aug 11, 2020, 08:08 PM IST
Ap Corona Update: మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా ( Corona ) విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ 7-10 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న 7 వేల కేసులు నమోదవగా...తాజాగా 9 వేల కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ఎక్కువే ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో 58 వేల 315 పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం ( Ap Government ). రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 2 లక్షల 44 వేల 549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 వేల 113 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో లక్షా 54 వేల 749 మంది కోలుకోగా...87 వేల 597 యాక్టివ్ కేసులున్నాయి.  తాజాగా కరోనా వైరస్  Corona virus ) కారణంగా 87 మంది మరణించగా..ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 వేల 203 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 25 లక్షల 92 వేల 619 కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests ) చేశారు. Also read: Covdi 19 Review : రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

Trending News