ఆంధ్రా నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్ !

ఆంధ్రా నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్

Last Updated : Sep 22, 2018, 04:14 PM IST
ఆంధ్రా నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్ !

ఆంధ్రా నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంకకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తోన్న ఓ ముఠాను నిన్న ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో డిఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్) బృందాలు పట్టుకున్నాయి. ఈ ముఠాకు చెందిన వాహనం నుంచి 229.8 కిలోల గంజాయిని డీఆర్ఐ సిబ్బంది స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. డీఆర్ఐ సిబ్బందికి పట్టుబడిన ఇద్దరు నిందితులు ఈ గంజాయిని మొదటగా తమిళనాడుకు తరలించి, అక్కడి నుంచి శ్రీలంకకు తరలించనున్నట్టు అంగీకరించారు. 

పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం నిందితులను జుడిషియల్ కస్టడీకి తరలించారు.

More Stories

Trending News