Budget 2019: ఏడాదిలో కోటికి మించి నగదు విత్ డ్రా చేస్తే పన్ను బాదుడు !!

బ్యాంకుల్లో నగదు విత్ డ్రా పరిమితి కోటి దాటితే పన్నుతప్పందని ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ పేర్కొన్నారు

Last Updated : Jul 5, 2019, 05:52 PM IST
Budget 2019: ఏడాదిలో కోటికి మించి నగదు విత్ డ్రా చేస్తే పన్ను బాదుడు !!

ఏడాది వ్యవధిలో కోటికి మించి నగదు విత్ డ్రా చేస్తే పన్ను బాదుడుకు సిద్ధమంటోంది మోడీ సర్కార్. ఈ మేరకు లోక్ సభలో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భభంలో ఆమె మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో బ్యాంకు నుంచి రూ.కోటి కి మించి నగదు విత్‌డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా  రూ.2 కోట్లకు మించి ఏటా ఆదాయం పొందే హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌పై కొత్త సర్‌ఛార్జిని విధించారు. గతంలో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయంపై చెల్లించే పన్నుపై ఇంతవరకు 15 శాతం సర్‌ఛార్జి ఉండేది. అయితే ఇప్పటి నుంచి దానిని 25 శాతానికి పెంచారు.  ఒకవేళ ఆదాయం రూ. 5 కోట్లు దాటితే సర్‌ఛార్జ్ 15శాతం నుంచి 37శాతానికి పెరుగుతుంది. 
 

Trending News