Heart Attack: ప్రాణాలు పోతున్నా వీడని కర్తవ్యం.. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తుండగా డ్రైవర్ కు గుండెపోటు..

Visakhapatnam: మల్కాపురం పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదం తప్పింది. 300 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహన డ్రైవర్ కు గుండెనొప్పి వచ్చింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లి ఆపాడు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 25, 2024, 02:05 PM IST
  • లారీ నడుపుతుండగా గుండెపోటు..
  • పారిశ్రామిక వాడలో తప్పిన ప్రమాదం..
Heart Attack: ప్రాణాలు పోతున్నా వీడని కర్తవ్యం.. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తుండగా డ్రైవర్ కు గుండెపోటు..

Driver died due to heart attack in Visakhapatnam: ఇటీవల కాలంలో చాలా మంది తరచుగా హర్ట్ ఎటాక్ లకు గురౌతున్నారు. ప్రస్తుతం మారిపోయిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం  వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో చిన్న తనంలోనే చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. చాలా మంది చిన్న వయస్సులోనే గుండెజబ్బులకు గురైన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొందరు డ్యాన్స్ లు చేస్తు, మరికొందరు జిమ్ లు చేస్తు గుండెపోటుకు గురౌతున్నారు. వాహనాలు నడిపిస్తున్నప్పుడు కూడా కొందరు హర్ట్ ఎటాక్ లకు గురౌతున్నారు.

Read more: Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?

అదే విధంగా.. అప్పటి దాక బాగానే ఉన్న వాళ్లు కాస్త ఒక్కసారిగా కుప్పకూలీపోతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటుకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొందరు గుండె నొప్పిగా అన్పించగానే.. అంతటి క్లిష్టపరిస్థితిల్లో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా..తమ ప్రాణాల మీదకు వస్తున్న.. ఇతరుల ప్రాణాలు కాపాడాటానికి చివరి వరకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవకు చెందని ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

విశాఖ పట్నంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మల్కాపురం పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదం తప్పింది. 300 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహన డ్రైవర్కు గుండెనొప్పి వచ్చింది. వెంటనే అతను సమ యస్ఫూర్తితో వ్యవహరించాడు. దీంతో వందల మంది ప్రాణాలు డెంజర్ నుంచి బైటపడ్డాయని చెప్పవచ్చు.ఈ ఘటన మారుతి జంక్షన్లో జరిగింది. విశాఖలోని..గాజువాక ఆటోనగర్ ప్రాంతా నికి చెందిన నరవ శ్రీనివాసరావు (50) బుధవారం ఉదయం ఎనిమిది గంట లకు గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంలో విధులకు హాజరయ్యాడు.

ఈ నేపథ్యంలో.. లారీలో 300 సిలిండ ర్లను లోడ్ చేసుకుని వీడీఆర్ గొడౌన్ మీదుగా మల్కాపురం వైపు వెళ్తున్నారు. మారుతి జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే అతను లారీని పక్కకు తీసుకెళ్లాడు. అంత బాధలోనూ వాహనం అతి కష్టంపై డివైడర్ పక్కకు చేర్చి స్టీరింగ్ మీద వాలి పోయారు. దీంతో  అటుగా వెళ్తున్నవారు గమనించి డ్రైవర్ను బయటకు తీసి.. 108 వాహనానికి ఫోన్చేసి, మల్కాపురం పోలీసులకు సమాచార మిచ్చారు. వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది డ్రైవర్ శ్రీనివాస్ ను పరీక్షించారు.

Read more: Needle In Body: కడుపులో సూది మరచిన వైద్యులు.. రోగికి రూ.5 లక్షలు బహుమానం

అప్పటికి అతనిలో ఎలాంటి చలనంలేదు. ఈనేపథ్యంలో.. అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్థం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఇదిలా ఉండగా.. సదరు లారీలను తీసుకెళ్తున్న సమీపంలోనే హెచ్ పీ పెట్రో పార్కు కంపెనీ బీపీసీఎల్, ఈపీఎల్ తదితర ఆయిల్ పరిశ్రమలు, రసాయనాలతో ఉన్న గొడౌన్  లున్నాయి. వాహనం బోల్తాపడి గ్యాస్ సిలిండర్లు పేలిపోతే పెను ప్రమాదమే జరిగేదని కూడా చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News