Earthquake: నెల్లూరు జిల్లాలో భూకంపం కలకలం.. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చిన ప్రజలు

Earthquake In Nellore District: ఉన్నఫళంగా భూమి కంపించింది.. భారీ శబ్ధం రావడంతోపాటు ఇళ్లలోని సామాన్లు కిందపడడంతో ప్రజలు భయాందోళన చెందారు. కొందరు నిద్రపోకుండా భయంతో అలాగే ఉండిపోయారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 14, 2024, 11:05 PM IST
Earthquake: నెల్లూరు జిల్లాలో భూకంపం కలకలం.. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చిన ప్రజలు

AP Earth Quake: ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం కలకలం రేపింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇంటిలోని సామగ్రి కిందపడడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చాయి. రోడ్డుపైకి చేరుకుని ఆందోళన చెందారు. కొన్ని ఇళ్లకు, భవనాల గోడలకు పగుళ్లు వచ్చాయి. 

Also Read: Petrol Diesel Prices: వాహనదారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రదేశాల్లో  స్వల్పంగా భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై 4.8గా నమోదైనట్లు సమాచారం. సూళ్లూరుపేట, దొరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, తడ మండలాల్లో మూడు సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. తీవ్రత ఎక్కువ ఉన్న పలు ప్రాంతాల్లో గోడలకు బీటలు వారాయి. భూకంపం వార్తతో ప్రజల్లో ప్రాణభయం పట్టుకుంది.

Also Read: Mamata Banerjee Injury: పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం.. అసలేం జరిగింది?

రాత్రిపూట భూకంపం రావడంతో స్థానికులు నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి మళ్లీ వస్తుందనే భయాందోళనతో  కొందరు జాగరణ చేయగా.. మరికొందరు ఆరు బయట నిద్రించారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండడంతో భూమి కంపించడం జరుగుతుంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిందేమి లేదని, తక్కువ తీవ్రతతో భూమి కంపిస్తుదని వివరణ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి భూకంపం వచ్చాయని స్థానికులు గుర్తు చేసుకుంటున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News