Army Village: దేశ సరిహద్దుల్లో ఉండే వారిని మొత్తం దేశ ప్రజలు గౌరవిస్తారు. కానీ దేశ సరిహద్దుల్లో పహారా కాసేందుకు ఆర్మీలో జాయిన్ అవ్వమంటే మాత్రం బాబోయ్ నాకు వద్దు ఆర్మీ ఉద్యోగం అంటూ పారిపోతారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆర్మీ ఉద్యోగం పట్ల ఆసక్తి కనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మీ జాబ్ అంటే అస్సలు ఇష్టం ఉండే వారు కాదు.
దేశం పై ప్రేమ, భక్తతో మాత్రమే జనాలు కొందరు ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు డబ్బు కోసం ఆర్మీలో జాయిన్ అవుతున్న వారు కూడా కొందరు ఉన్నారు అది వేరే విషయం. ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు యువత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీకి చెందిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే కడప జిల్లా కలసపాడు మండలం యగువ రామాపురం కు చెందిన యువత ప్రతి సంవత్సరం ఆర్మీ సెలక్షన్స్ కు హాజరు అవుతూ ఉంటారు. 1989 నుండి దేశ రక్షణ కోసం ఆ గ్రామం నుండి వందల మంది యువత ఆర్మీకి వెళ్లడం జరిగింది. మూడు తరాల వారు ఆర్మీలో జాయిన్ అయ్యారు.
దేశ రక్షణ కోసం ఆ గ్రామంలోని దాదాపు 350 మంది సైనికులు ఆర్మీలో ఉన్నారు. దశాబ్దాల కాలంగా ఆ గ్రామం నుండి ఆర్మీకి వెళ్లడం అలవాటుగా మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా దేశ రక్షణ కోసం యగువ రామాపురం గ్రామంకు చెందిన వారు ఆర్మీకి వెళ్లడం జరిగింది. 350 మంది వెళ్లినా కూడా ఇంకా ఆ గ్రామం నుండి ఆర్మీకి వెళ్లేందుకు సిద్ధం అవుతూనే ఉన్నారు.
ఈ మధ్య కాలంలో యువత అంతా కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే రామాపురం గ్రామానికి చెందిన యువత మాత్రం జీతం పై పెద్దగా మక్కువ చూపించకుండా ఆర్మీ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా దేశం కు సేవ చేయాలని ప్రతి ఒక్కరిలో కోరిక కలుగుతుంది. ఆర్మీ కి సెలక్ట్ అవ్వని వారి పట్ల అక్కడ చిన్న చూపు ఉంటుంది.
అందుకే ఎంత కష్టం అయినా పడి ఆర్మీకి సెలక్ట్ అవ్వడంతో దేశ రక్షణ కోసం పెద్ద ఎత్తున సేవ చేయడం వారికి అలవాటుగా మారుతూ వచ్చింది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. దేశం మొత్తం కూడా రామాపురం గ్రామాన్ని చూసి... ఆ గ్రామంలోని యువతను చూసి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి