సభలో ఏపీ బడ్జెట్ 2019-20 ; రెండు లక్షల కోట్లు దాటిన పద్దు

అసంబ్లీలో  2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంగళవారం  ప్రవేశపెట్టారు

Last Updated : Feb 5, 2019, 12:56 PM IST
సభలో ఏపీ బడ్జెట్ 2019-20 ; రెండు లక్షల కోట్లు దాటిన పద్దు

ఆంధ్రప్రదేశ్ అంసెంబ్లీలో ఏపీ సర్కార్ బడ్జెట్ -2019 -20 ప్రవేశపెట్టింది. రూ.2,26,117.53 కోట్ల కేటాయింపులతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరుగుదల.

యనమల చెప్పిన బడ్జెట్ లెక్కల ప్రకారం  రెవెన్యూ లోటు వ్యయం రూ.1,80,369.33కోట్లుగా చూపించారు. ఇది గత ఏడాది కంటే 20.03శాతం పెంపు. మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు. కాగా యనమల బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 11వ సారి కావడం గమనార్హం.

కాగా బడ్జెట్ స్వరూపం ప్రజాకర్షకంగా సంక్షేమ, అభివృద్ధి సమ్మేళనంగా ఉంది. ఎన్నికల ముంచుకొస్తున్న నేఫథ్యంలో మరిన్ని ప్రజాక్షణ కలిగిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని కొత్త వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. 

బడ్జెట్ స్వరూపం :
మొత్తం బడ్జెట్: 2,26,117.53 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు

మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు
రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లు
ఆర్థికలోటు రూ. 32,390.68కోట్లు

 

 

Trending News