Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావుకు ఓ పక్కా సమాచారం అందింది. విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి. కె.వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఏ.సి.పి.లు వి.ఎస్.ఎన్.వర్మ, టి. కనకరాజు, ఎస్.ఐ కె. శేషా రెడ్డి తమ సిబ్బందితో విజయవాడ, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస యాచరీస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
Read also : Ganja peddlers: గంజాయితో పట్టుబడిన బీటెక్ విద్యార్థులు
రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుండి హైదరాబాద్‌కు ఏపీ 5 సిజె 1235 నెంబర్ గల ఇన్నోవా, ఎపి 31డిబి 5259 నెంబర్ గల కార్లలో గంజాయిని తీసుకెళ్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా వల వేసి పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ. 12,30,000 విలువైన 246 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు :
1) అమ్మిరెడ్డి వెంకట లక్ష్మీ (28), నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా,
2) నల్లబెల్లి హరినాథ్ (19), కొత్తలపాలెం, విశాఖపట్నం జిల్లా,
3) లంబసింగి రాజు (35), చింతపల్లి, విశాఖపట్నం జిల్లా,
4) తుంది శ్రీను (35), నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా,
5) కిల్లంపల్లి రాంబాబు (27), నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా,
6) కొర్రా మహేష్ బాబు (26), చింతపల్లి, విశాఖపట్నం జిల్లా,
కొర్రా శాంతి (35), చింతపల్లి, విశాఖపట్నం జిల్లా.
8) కొర్రా అనిత (27), చింతపల్లి, విశాఖపట్నం జిల్లా,
రోడ్డు మార్గం గుండా ట్రావెల్స్ వాహనాల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు మహిళలతో కలసి ట్రావెల్ చేస్తూ కారు వెనుక డిక్కీలో అక్రమంగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం జిల్లా, చింతపల్లి నుండి గంజాయిని తీసుకుని విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుని.. అక్కడ గంజాయిని విక్రయించేందుకు వెళ్ళుతున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు.
ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న రెండు గార్లను గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు అభినందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..