Ganja peddlers: గంజాయితో పట్టుబడిన బీటెక్ విద్యార్థులు

తిరువూరు చెక్ పోస్టు వరుసగా రెండోసారి వార్తల్లోకొచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న ఓ కారును తిరువూరు చెక్ పోస్ట్ ( Tiruvuru check post ) వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇదే చెక్ పోస్టు వద్ద తాజాగా ముగ్గురు విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు ( B.Tech students caught peddling Ganja ).

Last Updated : Jun 3, 2020, 10:15 PM IST
Ganja peddlers: గంజాయితో పట్టుబడిన బీటెక్ విద్యార్థులు

కృష్ణా జిల్లా: తిరువూరు చెక్ పోస్టు వరుసగా రెండోసారి వార్తల్లోకొచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న ఓ కారును తిరువూరు చెక్ పోస్ట్ ( Tiruvuru check post ) వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇదే చెక్ పోస్టు వద్ద తాజాగా ముగ్గురు విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు ( B.Tech students caught peddling Ganja ). పోలీసులు విద్యార్థుల నుంచి 10 కేజీల 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతుండగా మకొకరు ఐటీఐ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు తిరువూరు పోలీసులు తెలిపారు. తనిఖీ చేస్తున్న పోలీసులపై కాల్పుల కలకలం.. చివరికి! )

యువత చెడు సావాసాలతో మత్తులో చిత్తవుతోందడానికి అప్పుడప్పుడు వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంకొంత మంది యువత అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం గంజాయి తరలింపు వాటిని ఓ మార్గంగా ఎంచుకుంటున్న సందర్భాలూ లేకపోలేదని చెబుతున్న పోలీసులు.. విద్యార్థులు సన్మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించకపోతే వారే వారి విలువైన భవిష్యత్తును కోల్పోతారని హితవు పలుకుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News