అలా అయితే జగన్ కు నోబెల్ వస్తుంది...

కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  

Last Updated : Mar 18, 2020, 10:59 PM IST
అలా అయితే జగన్ కు నోబెల్ వస్తుంది...

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా బారినుండి కాపాడుకోవాలంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకుని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలంటూ వ్యాఖ్యలు చేయడం జగన్ మోహన్ రెడ్డిగా అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయని,  దీని వల్ల ఏపీలోని అధికారులు, డాక్టర్ల పరువు పోయిందని అన్నారు.

Also Read: Read also : ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus సోకే రిస్క్ ఎక్కువ ? ఎవరు సేఫ్ ?

కరోనా నియంత్రణకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ ను వాడితే సరిపోతుందని అనడంపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఒకవైపు ప్రపంచమంతా కఠోరమైన దీక్షతో ఎలా నివారించాలని ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి వ్యాఖలు చేయడం ఏ మాత్రం సరికాదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు నోబెల్ ప్రైజ్ కూడా వస్తుందని ఎద్దేవా చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read Also: Read also : కరోనావైరస్ భారత్‌లో అంతగా వ్యాపించకపోవడానికి కారణాలు ఇవేనా ?

Trending News