Heavy Rain fall: విజయవాడ, గుంటూరులో వర్ష బీభత్సం, విజయవాడ జలమయం, గుంటూరులో ముగ్గురి మృతి

Heavy Rain fall: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 31, 2024, 05:08 PM IST
Heavy Rain fall: విజయవాడ, గుంటూరులో వర్ష బీభత్సం, విజయవాడ జలమయం, గుంటూరులో ముగ్గురి మృతి

Heavy Rain fall: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమై వాయుగుండంగా మారింది. ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడ, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉంది. ఈ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మరణించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయిలో పడుతున్న వర్షం కారణంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో చాలా ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం ఊర్లో వరద నీరు చేరింది. భారీ వర్షాలతో ఇబ్రహీం పట్నం బస్టాండ్‌లో బస్సులు సగానికి నీళ్లలో మునిగి ఉన్నాయి. విజయవాడ నగరం జలదిగ్బంధమైంది. 

ప్రస్తుతం విజయవాడ వన్‌టౌన్ పరిస్థితి ఘోరంగా మారింది. ఈ ప్రాంతమంతా పూర్తిగా నీట మునిగింది. ద్విచక్ర వాహనాలు, కార్లు మునిగిపోయింది. ఇంకాస్సేపు వర్షం పడితే మనిషి మునిగే లోతు నీళ్లు రావటం ఖాయంగా కన్పిస్తోంది.

విజయవాడ నగరంలోని రహదారులన్న దాదాపుగా జలమయమయ్యాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కానూరు వరకూ రహదారి నీట మునిగింది. ఆర్టీసీ ప్రాంతమంతా జలదిగ్భంధంలో చిక్కుకుంది. దుర్గ గుడిపై కూడా భారీ వర్షాలు ప్రభావం ఉంది. ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. 

Gunturలో    209.75 మిల్లీమీటర్లు,  SRM University వద్ద 180 మిల్లీమీటర్లు, ఇన్నవోలు వద్ద 156 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరూ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మరణించారు. ఈ ఘటన పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగింది. నంబూరు స్కూళ్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మురుగు నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయి ముగ్గురు మరణించారు

Also read: Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News