Weather updates: మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Last Updated : Jun 21, 2020, 03:24 PM IST
Weather updates: మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రేపట్నించి మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ( Read also: International Yoga day 2020: కరోనా కష్టాలకు ప్రాణాయామంతో చెక్: ప్రధాని మోదీ )

భారీవర్షాలతో పాటు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలు వీయనున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ అయింది. ఉత్తర ఒడిషా తీరంపై నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు రాజస్తాన్ నుంచి మధ్య భారతదేశం, ఉత్తర ఒడిషాలో నెలకొన్న ఆవర్తనం మీదుగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. దాంతో రుతుపవనాలు ( Monsoon) మరింత చురుగ్గా మారనున్నాయి. అందుకే కోస్తాంధ్రలో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ( IMD ) తెలిపింది.

Trending News