Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ లేటెస్ట్ అప్‌డేట్స్ విషయానికొస్తే.. భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా నివేదికల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. క్రమక్రమంగా తుఫాన్ గా మారుతున్న ఈ అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో తీరానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి మోచ తుఫాన్‌తో ముప్పు లేదని.. మే 12న ఉదయం బంగాళాఖాతం మధ్యలో కేంద్రీకృతమై ఉండే మోచ తుఫాన్.. మే 12 నుంచి తన గమనాన్ని మార్చుకుని బంగ్లాదేశ్, మయన్మార్ తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా మృత్యుంజయ్ మహాపాత్రో స్పష్టంచేశారు.
మోచ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వాతవరణంలో సోమవారం 85 శాతం తేమ నమోదైంది. దక్షిణ 24 పరగణాస్, ఉత్తర 24 పరగనాస్, హూగ్లీ, బంకుర, బీర్భూమ్, పుర్బా, మెదినిపూర్, హౌరా, పుర్బా, పశ్చిమ్ బర్దమాన్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని.. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ కేంద్రం మీడియా ప్రతినిధి స్పష్టంచేశారు. రాబోయే రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశాలైతే లేవని భారత వాతావరణ కేంద్రం మీడియా ప్రతినిధి తెలిపారు.
#WATCH | DG IMD, Dr Mrutyunjay Mohapatra gives an update on #CycloneMocha; says, "...it will continue to move & intensify gradually into a cyclonic storm by 10th May. It will move towards the central part of Bay of Bengal & by the 12th morning it will be over the central part of… pic.twitter.com/0W7o7m9mcf
— ANI (@ANI) May 8, 2023
భారత వాతావరణ శాఖ ప్రస్తుతం వేస్తోన్న అంచనాల ప్రకారం మోచ తూఫాన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలకంటే ఉత్తరాదిన పశ్చిమ బెంగాల్, ఆ తరువాత ఒడిషా రాష్ట్రాలపైనే అధికంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే మోచ తుఫాన్ గమనం ఎటువైపు ఉండనుంది అనేది రేపు లేదా ఎల్లుండి పూర్తి అవగాహనకు వచ్చే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ ప్రతినిథి అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు మోచ తుఫాన్ తో ఆందోళనకరమైన పరిస్థితులు ఏవీ లేవనే తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : AP Farmers' Paddy Loss: ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు
ఇదిలావుంటే, మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా మోచా తుఫాన్ నేపథ్యంలో రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి : Top CEOs' Salary: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు
ఇది కూడా చదవండి : iPhone 14 Best Price: అమేజాన్ vs ఫ్లిప్‌కార్ట్ vs విజయ్ సేల్స్.. మూడింట్లో ఎక్కడ తక్కువ ధర ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK