Purandeswari on Alliance: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. జగన్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే మనకు ఇదే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. శనివారం పవన్ కల్యాణ్ సైతం పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దన్నారు. ఇదే విషయాన్ని మా మిత్రపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ సైతం తేటతెల్లంచేశారన్నారు. అయితే పొత్తులపై ఎలా వెళ్లాలనేది జాతీయ నాయకులు నిర్ణయిస్తారని తెలిపారు.
ప్రధానంగా బీజేపీ, జనసేన మధ్య దూరం పెరిగినట్టు వస్తున్న వార్తలను పురందేశ్వరి ఖండించారు. బీజేపీ జనసేనల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తేల్చిచెప్పారు. అగ్రనాయకుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదన్న ఆమె.. క్షేత్రస్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉందని స్పష్టం చేశారు. కరోనా వల్ల బీజేపీ జనసేనల మధ్య దూరం పెరిగిందని పవన్ కల్యాణే చెప్పారని పురందేశ్వరి గుర్తుచేశారు. బీజేపీ జనసేన మధ్య పొత్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు పురందేశ్వరి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయన్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక గురించి జనసేన పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపామన్నారు బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.
Also Read:Home Loan EMI Offers: హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, కావల్సిన అర్హతలేంటి
Also Read:Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook