India's first private rocket Vikram-S launch today: భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెడీ అయింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకి విక్రమ్ - ఎస్ (Vikram-S)రాకెట్ నింగికి ఎగరనుంది. ఈ రాకెట్ మూడు శాటిలైట్లని కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. ఇందులో చెన్నై స్పెస్ కిడ్జ్ విద్యార్థులు రూపొందించిన ఫన్ శాట్ తో పాటు మరో రెండు విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి.
హైదరాబాద్ కి చెందిన స్కై రూట్ ఏరో స్పేస్ అనే స్టార్టప్ కంపెనీ విక్రమ్ - ఎస్ ను అభివృద్ధి చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరాకెట్ ను ప్రయోగించనున్నారు. దీనికి ఇస్రో 'ప్రారంభ్ మిషన్' గా నామకరణం చేసింది. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే దేశ, విదేశాలకు చెందిన అనేక ప్రైవేట్ ఏజన్సీలు తమ రాకెట్లని పంపేందుకు ఇస్రోని ఆశ్రయించే అవకాశం ఉంది.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి 2020లో నాంది పడింది. దీని కోసం మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో ఇన్-స్పేస్‌ఈ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఇస్రోకు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. 2040 నాటికి వరల్డ్ వైడ్ గా అంతరిక్ష పరిశ్రమ విలువ 80 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఇండియా వాటా దాదాపు 2 శాతమే. దీన్ని అధిగమించడం కోసమే భారత్ స్పేస్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పోత్సాహిస్తోంది.
Also read: ED Director SK Mishra: ఎస్.కె. మిశ్రాకే మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ పగ్గాలు.. కేంద్రం సంచలన నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook