Telangana: మా వాళ్లతో కొట్టిస్తాం.. డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. వీడియో వైరల్..

Nakirekal bustand: నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలోన ముగ్గురు మహిళలకు నరిరేకల్ బస్టాండ్ లో బస్సు ఎక్కారు తమ బంధువు వస్తుందని చెప్పి, బస్సు ఆపాలని కోరారు. ఈ క్రమంలో బస్సును ముందకు పోనివ్వడంతో, మహిళలు కండక్టర్ ను నోటికొచ్చినట్లు తిట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : May 25, 2024, 01:07 PM IST
  • బస్సులో సిబ్బందితో గొడవ పడ్డ మహిళలు..
  • సోషల్ మీడియాలో రచ్చగా మారిన ఘటన..
Telangana: మా వాళ్లతో కొట్టిస్తాం.. డ్రైవర్ కు  వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. వీడియో వైరల్..

Woman passengers arguments with conductor: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణానికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. ఇదిలా ఉండగా.. ఫ్రీబస్సులో సీట్ల కోసం తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొందరు కండక్టర్ తో గొడవలు పడుతున్నారు. సీటు కోసం కొన్ని చోట్ల మహిళలు జుట్టులు పట్టుకుని కొట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కండక్టర్ ఆధార్ కార్డు అడిగాడని, చూపించకుండా గొడవలు దిగుతున్నారు. మరికొందరు టికెట్ కుసరిపడా టికేట్ ఇవ్వకుండా బస్సులో నానా రచ్చ చేస్తున్నారు. తమ భార్యల కోసం సీట్లు ఆపీ,ఇదరులు ఆ సీట్లలో కూర్చుంటారని గొడవలు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేక చోట్ల గొడవలు పడటం, సీట్ల కోసం కొట్టుకున్న ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇక తాజగా, మరో ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

 

పూర్తి వివరాలు..

నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలో..  నకిరేకల్ బస్టాండులో ముగ్గురు మహిళలు బస్సు ఎక్కారు. తమ చుట్టపు మనిషి వస్తుంది ఆగమని డ్రైవరును కోరారు.  దీంతో డ్రైవర్ ఒక ఐదు నిముషాలు చూశాడు. కానీ బస్సులో మిగతా ప్రయాణికులు అభ్యంతరం చెప్పడం వల్ల బస్సును ముందుకు పొనిచ్చాడు. దీంతో మహిళలు ఆవేశంతో ఊగిపోయారు. డ్రైవర్ ను  బూతులు తిడుతూ.. సూర్యాపేట వెళ్ళిన తరువాత మా వాళ్ళతో కొట్టిస్తామని హెచ్చరించారు.

అంతటితో ఆగకుండా.... డ్యూటీ ఎలా చేస్తావో చూస్తాం.. అని బెదిరించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు ఇలా మాట్లాడటం సంస్కారం కాదని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వీరు మాత్రం ఆమాటలేవి పట్టించుకోలేదు. బస్సులో ప్రయాణికులు, కండక్టర్ లు, డ్రైవర్ లకు సారీ చెప్పాలని కోరారు. కానీ మహిళలు మాత్రం మోండికేశారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ బస్సును స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. తమతో వాగ్వాదానికి దిగిన వారిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

తమ విధులకు ఆటంకం కలిగించారని,  బస్సును డ్రైవర్ పోలీస్ స్టేషన్ ముందు ఆపారు. పోలీసులు వచ్చి విచారించగా తాము పోలీస్ స్టేషన్ లోకి రామని భీష్మించుకుని  మహిళా ప్రయాణికులు కూర్చున్నారు. దీంతో పోలీసులు వెనుతిరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. దీనిపై చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు తీవ్రంగా స్పందించారు. బస్సులో తమముందే కండక్టర్ ను నోటికొచ్చినట్లు దూశించారంటూ కూడా చెప్పారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News