Karnataka Milk Federation: ‘రూ.130 కోట్లు చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు పాలు సరఫరా చేస్తాం’

Karnataka Milk Federation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు బకాయి ఉన్న రూ.130 కోట్లను చెల్లిస్తే గానీ.. అక్కడి అంగన్వాడీలకు పాలు సరఫరా చేయబోమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వెల్లడించింది. అంతే కాకుండా ఇకపై పాల ధరను కూడా లీటరు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 03:16 PM IST
Karnataka Milk Federation: ‘రూ.130 కోట్లు చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు పాలు సరఫరా చేస్తాం’

Karnataka Milk Federation: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ.. అక్కడి అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) సోమవారం స్పష్టం చేసింది. అంతేగాక, ఇకపై పాల ధరను కూడా లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది.

సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జూన్‌లో కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నారన్న కారణంతో లీటర్‌ ధరపై రూ.5 తగ్గించేందుకు కూడా కేఎంఎఫ్‌ అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలా 110లక్షల లీటర్ల పాలను ఏపీ సర్కారు కేఎంఎఫ్‌ నుంచి కొనుగోలు చేస్తోంది.

అయితే గత నాలుగు నెలలుగా ఏపీ ప్రభుత్వం.. కేఎంఎఫ్‌కు ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయి రూ.130కోట్లకు చేరాయి. ఈ బకాయిల గురించి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఏపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీసీ సతీశ్‌ తెలిపారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వానికిచ్చే రూ.5 సబ్సీడీని కూడా తొలగిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేఎంఎఫ్‌ తెలిపింది. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించలేదని సతీశ్‌ పేర్కొన్నారు.

‘‘పెట్టుబడి ఖర్చులు, ఇంధన ధరలు పెరిగిపోవడంతో కర్ణాటక పాల యూనియన్లు నష్టాల్లో ఉన్నాయి. అందువల్ల పాత ధరకే పాలు సరఫరా చేయడం కుదరదు. అంతేగాక, ఏపీ ప్రభుత్వం బకాయిలు పడ్డ కారణంగా పాల ఉత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతున్నాం. అందువల్ల ఏపీ ప్రభుత్వం రూ.130కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు పాల ధరను లీటరుకు రూ.5 పెంచితేనే ఇక మీదట పాలు సరఫరా చేయగలం’’ అని కేఎంఎఫ్‌ ఎండీ సతీశ్‌.. ఏపీ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. 

Also Read: YS Vivekananda Reddy: వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ చేతికి కీలక ఆధారాలు 

Also Read: Operation Parivartan: గంజాయికి చెక్, ఆపరేషన్ పరివర్తన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News