Karthika Masam effect: ఇవాళే చివరి కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ముఖ్యంగా శ్రీశైలం మలన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పవిత్ర నదులైన కృష్ణా, గోదావరిల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దీపాలను వెలిగించిన నదుల్లో వదులుతున్నారు.
జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైల మలన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అర్ధరాత్రి నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగించి మెుక్కులు తీర్చుకుంటున్నారు.
మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, మంచి నీరు, అల్పాహారం అందిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ ఈశాన్యభాగంలో ఉన్న పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
Also Read: Sabarimala: శబరిమల వద్ద అదుపులోకి వచ్చిన భక్తుల రద్దీ.. ఇక దర్శనానికి 4 గంటలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి