YS Sharmila: వైఎస్‌ షర్మిల బర్త్‌ డే వేడుకల్లో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు

Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 17, 2024, 04:14 PM IST
YS Sharmila: వైఎస్‌ షర్మిల బర్త్‌ డే వేడుకల్లో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు

YS Sharmila Birthday: తమ పార్టీ నాయకురాలి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకుంటూ పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఈ ఘటనకు కారణమైంది. వైఎస్‌ షర్మిల జనదిన వేడుకలు రసాభాసగా మారాయి. ఏపీలోని కడప జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పరువు బజారున పడింది.

Also Read: Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టికి గ్రహాల గండం.. 'సంపర'లో పాప పరిహార పూజలు

కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జన్మదిన (17 డిసెంబర్‌) వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల జరిగాయి. ఆమె సొంత జిల్లా కడపలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా షర్మిల జన్మదిన వేడుకలు నిర్వహించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు రసాభాసగా మారాయి. ఈ వేడుకలు వేదికగా నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు బహాబాహీకి దిగారు.

Also Read: YSRCP Win: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు 2027లోనే.. అందరూ సిద్ధంగా ఉండాలి

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, కడప పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో తనకు సమాచారం లేదని అఫ్జల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడికి తెలియకుండా కడపలో ఎలా వేడుకలు నిర్వహిస్తారని ఆయన నిలదీశారు. అతడు నిలదీయంతో విజయజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షురాలిని నిలదీస్తారా అంటూ ఆమె ఆగ్రహంతో వెనుదిరిగారు.

'నగర అధ్యక్షుడు  ఆఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయం అని చెబుతున్నాడు. ఇది డీసీసీ కార్యాలయం కాదని చెబుతున్నారు. ఈ ఆఫీస్‌తో నాకు సంబంధం లేదు అంటున్నారు' అని విజయజ్యోతి తెలిపారు. అన్ని ఆయనకు చెప్పి చేయాల్నా? అని ప్రశ్నించారు. నగర అధ్యక్షుడు అఫ్జల్‌ ఖాన్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. తనకు పార్టీ కార్యాలయంతో సంబంధం ఉందో లేదో అధిష్టానం తేలుస్తుందని విజయజ్యోతి పేర్కొన్నారు. ఈ పంచాయితీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News