Vizag gas leak: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఈఓ సహా 12 మంది అరెస్ట్

Vizag gas leak tragedy: విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 మందిని బలిదీసుకున్న ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావు సహా మొత్తం 12 మందిని విశాఖ పోలీసులు ( Vizag police ) అరెస్ట్‌ చేశారు.

Last Updated : Jul 7, 2020, 10:20 PM IST
Vizag gas leak: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఈఓ సహా 12 మంది అరెస్ట్

Vizag gas leak tragedy: విశాఖపట్నం: విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 మందిని బలిదీసుకున్న ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావు సహా మొత్తం 12 మందిని విశాఖ పోలీసులు ( Vizag police ) అరెస్ట్‌ చేశారు. ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ( Vizag CP RK Meena ) ఈ వివరాలను వెల్లడించినట్టుగా పీటీఐ పేర్కొంది. మే 7న జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోగా మరో 585 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. 

Also read: Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా

ఎల్జీ పాలిమర్స్‌ ( LG Polymers ) యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్పష్టంచేస్తూ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ( AP CM YS Jagan ) సమర్పించింది. నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి 4వేల పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో అనేక సంచలన విషయాలను కమిటీ పొందుపర్చింది. ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం జరిగిందని నీరబ్ కుమార్ కమిటీ ( Neerab Kumar committee ) నిర్థారించింది. కమిటీ ఇచ్చిన ఈ నివేదిక మేరకే విశాఖ పోలీసులు తాజాగా ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. Also read : Vizag gas leak tragedy : విశాఖలో విష వాయువు చిమ్మిన పరిశ్రమ ఎదుట మిన్నంటిన ఆందోళనలు

Trending News