ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు... జాగ్రత్త !!

ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో పిడుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి

Last Updated : Jun 26, 2019, 06:06 PM IST
ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు... జాగ్రత్త !!

రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలతో  పాటు పిడుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి . 

పిగుడు పాటు ప్రాంతాలు ఇవే...
పిడుగుపాటుకు అవకాశమున్న ప్రాంతాల పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లాలోని పామర్రు, మోపిదేవి, అవినగడ్డ, మొవ్వ,చల్లపల్లి, ఘంటసాల, నూజీవిడు,ముదినేపల్లి ప్రాంతాలు ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే  రేపల్లె,భట్టిప్రోలు మండలాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యారు.

జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
తాజా హెచ్చరికలు నేపథ్యంలో ఆయా ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుపాటు సయయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే యూపీలో 17 మంది బలి
ఇప్పటికే యూపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పిడుగు పాటు కారణంగా 17 మృతి  చెందినట్లు సమాచారం. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ ఇప్పటికి దాదాపు 58 మంది మృతి చెందినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది

Trending News