Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.
Thunder Lightning Viral Video: వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి మెరుపులు వచ్చి చెట్లపై మనుషులపై పిడుగులు పడడం మనం చూడవచ్చు. ఇలాంటి సంఘటననే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Lightning Kills Three Youth: దసరా వేడుకల్లో భాగంగా మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పిడుగుపాటు బలిగొంది. దసరా ఉత్సవాలతో సంబరాలు చేసుకుంటున్న ఆ ఊరిలో పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని నింపింది.
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
దక్షిణ అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.