అదిగో చంద్రబాబు పాలన..ఇదిగో జగన్ రూలింగ్ ..తేడా ఇదే అంటున్న లోకేష్

చంద్రబాబు పాలనతో పోల్చుతూ జగన్ సర్కార్ టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శలు సంధించారు

Last Updated : Aug 1, 2019, 01:23 AM IST
అదిగో చంద్రబాబు పాలన..ఇదిగో జగన్ రూలింగ్ ..తేడా ఇదే అంటున్న లోకేష్

చంద్రబాబు పాలనతో పోల్చుతూ జగన్ రూలింగ్ ను నారా లోకేష్ ఎండగట్టారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ చంద్రబాబు అభివద్ధి శాశ్వతమని..అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు వాటితో నిరంతరం ప్రయోజనం జరుగుతూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఏపీ మెడ్ టెక్ జోన్ ఒక ఉదాహరణ పేర్కొంటూ  విశాఖను దేశంలోనే మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీన్ని  చంద్రబాబు ప్రారంభించారని లోకేష్ కొనియాడారు. 

ఏపీ మెడ్ టెక్ జోన్ గురించి అవగాహనలేని వైసీపీ వాళ్ళు దాన్ని 'ఒక మయసభ' అంటూ హేళన చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఏపీ మెడ్ టెక్ జోన్ గురించి కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్ సాక్షింగా ప్రశంసలు కురిపిస్తే.. వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్రముఖులు ఆయనతో ఏకీభవిస్తూ చేసిన వ్యాఖ్యలను చూడండి. దటీజ్ చంద్రబాబుగారు అంటూ ఓ వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.

ఇదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనో ఆంధ్రప్రదేశ్ రైతుల ఏడు దశాబ్దాల కల నెరవేర్చారని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దేశంలోనే అతిపెద్ద స్పిల్ వే దాటి గోదావరి ప్రవహిస్తోంది. అన్ని అనుకున్నట్టుగా సకాలంలో పనులు జరిగినట్లయితే  ఈ పాటికి కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసి గేట్లు పెట్టి నీళ్ళిచ్చే పరిస్థితి ఉండేదని... జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అర్థం వచ్చేలా విమర్శలు సంధించారు.. ఇదిగో !  ఆంధ్రప్రదేశ్ రైతుల ఏడు దశాబ్దాల కల... అంటూ పోలవరం డ్యాంకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.

 

ఇదే సందర్భంలో అంసెబ్లీ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు లోకేష్ విమర్శలు సంధించారు. చంద్రబాబు ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి  పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తే.... ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో జగన్ గారు సాధించింది ఏంటి అంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా మైకులు తీసేయడం.... తమను నిలదీసిన ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయగలిగారు. బుగ్గనగారి గాలి లేఖలు, అబద్ధాల బుడగలతో, అనిల్, అంబటి లాంటి వారు తమ హావభావాలతో ప్రజలను నవ్విస్తూ తమ పాలన ఇంతే అని చెప్పగలిగారని లోకేష్ ఎద్దేవ చేశారు.
 

 

Trending News