Ganta Srinivas Meet Chiranjeevi: అధికారమే లక్ష్యంగా కాపులంతా ఏకమవుతున్నారా? గాడ్ ఫాదర్ తో గంటా ఏం చర్చించారు?

Ganta Srinivas Meet Chiranjeevi:  మెగాస్టార్ తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావడంతో విషెష్ చెప్పడానికే చిరంజీవిని కలిశానని గంటా శ్రీనివాస రావు చెబుతున్నా.. మెగా మీట్ లో రాజకీయ చర్చ కూడా జరిగిందనే ప్రచారం సాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Oct 8, 2022, 03:57 PM IST
  • చిరంజీవితో గంటా భేటీ
  • రాజకీయ వర్గాల్లో మెగా కాక
  • పాత కాపులను ఏకం చేస్తున్నారా?
Ganta Srinivas Meet Chiranjeevi:  అధికారమే లక్ష్యంగా కాపులంతా ఏకమవుతున్నారా? గాడ్ ఫాదర్ తో గంటా ఏం చర్చించారు?

Ganta Srinivas Meet Chiranjeevi:  ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఇటీవలే తన రాజకీయ భవిష్యత్, జనసేన పార్టీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో తాను జనసేనకు సపోర్ట్ చేస్తానేమోనంటూ చిరంజీవి చేసిన కామెంట్లు హాట్ హాట్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చారు గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రజా రాజ్యం పార్టీలో కీలక నేతగా ఉన్నారు గంటా శ్రీనివాస రావు. దీంతో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావడంతో విషెష్ చెప్పడానికే చిరంజీవిని కలిశానని గంటా శ్రీనివాస రావు చెబుతున్నా.. మెగా మీట్ లో రాజకీయ చర్చ కూడా జరిగిందనే ప్రచారం సాగుతోంది.

ప్రజా రాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు గంటా శ్రీనివాసరావు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పీర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ నేత అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2014లో బీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు. రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా ఘన విజయం సాధించారు గంటా శ్రీనివాస రావు. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. ప్రస్తుతానికి ఆయన టీడీపీలోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస రావు.. మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

కాపు సామాజికవర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవితో సన్నిహితంగా ఉన్నారు. చిరు పార్టీ పెట్టగానే అందులో జాయిన్ అయ్యారు. పీఆర్పీలో టాప్ లీడర్లలో ఒకరుగా నిలిచారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండటంతో టీడీపీ చేరారు. ఇటీవల సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటంతో గంటా మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. తమ్ముడి మద్దతుగా ఉంటానని చిరంజీవి చెప్పడంతో... కాపు నేతలంతా మళ్లీ ఏకమవుతున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీని బలోపేతం చేస్తూ అధికారమే లక్ష్యంగా కాపులు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే చిరంజీవితో గంటా చర్చలు జరిపారని అంటున్నారు. ఏపీలో జనసేన తరపున చిరంజీవి పాత మిత్రులందర్నీ ఏకం చేసే ప్రయత్నంలో గంటా ఉన్నారనే టాక్ వస్తోంది.

Read also: BRS IN AP: బీఆర్ఎస్ పార్టీతో వైసీపీకి లాభమా? కేసీఆర్, జగన్ మధ్య ఆ డీల్ కుదిరిందా?

Read also: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News