రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా!

రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా!

Updated: Oct 8, 2019, 04:35 PM IST
రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా!

విశాఖపట్నం: ఒడిషాతో పాటు ఆ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు తెలిపారు. 

రానున్న మూడు రోజులు ఇంచుమించు ఇటువంటి పరిస్థితి కొనసాగవచ్చునని.. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.