Chandrababu: ఏపీ రైతులను ఆదుకోవాలని... ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..

Chandrababu: మిచాంగ్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించడంతోపాటు.. రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 02:59 PM IST
Chandrababu: ఏపీ రైతులను ఆదుకోవాలని... ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..

Chandrababu Letter To PM Modi: ఏపీని మిచౌంగ్ తుపాను తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM Narendra Modi) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu) లేఖ రాశారు. మిచౌంగ్‌ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా మిచాంగ్ తుఫాన్ ను జాతీయ‌విప‌త్తుగా ప్రక‌టించాల‌ని విజ్ఞప్తి చేశారు. 

ఈ సైక్లోన్ రాష్ట్రంలోని సుమారు 15 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం 22 ల‌క్షల ఎక‌రాల్లో 10 వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లిన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ తుపాన్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పశువులు మృత్యువాతపడ్డాయి.  రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ నష్టం అంచనా వేసేందుకు కేంద్ర‌ బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. మిచౌంగ్ తుపాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటిస్తే.. బాధితులకు ఉపశమనం కలుగుతుందని చంద్రబాబు లేఖలో తెలిపారు. 

మరోవైపు పక్క రాష్ట్రం తమిళనాడులో మిచౌంగ్ ఎలాంటి బీభత్సం సృష్టించిందో చంద్రబాబు వివరించారు. ఈ సైక్లోన్ అయితే తమిళనాడు రాజధాని చైన్నైను చిగురుటాకులా వణికించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నప్పటికీ.. ఇంకా వరద భయం పోలేదు. ఈ తుపాన్ ధాటికి ఆ రాష్ట్రంలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News