Michaung Cyclone: మిచౌంగ్ తీవ్రరూపం, బాపట్ల వద్ద మద్యాహ్నం తీరం దాటనున్న తుపాను

Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇవాళ బాపట్ల సమీపంలో తీరం దాటనుంది. అతి భారీ వర్షాలు కురవనుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2023, 07:36 AM IST
Michaung Cyclone: మిచౌంగ్ తీవ్రరూపం, బాపట్ల వద్ద మద్యాహ్నం తీరం దాటనున్న తుపాను

Michaung Cyclone: మిచౌంగ్ తీవ్రతుపానుగా మారింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకు 170 కిలోమీటర్లు, బాపట్లకు 150, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో మిచౌంగ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు వస్తోంది. ఇవాళ మద్యాహ్నానికి బాపట్ల వద్దే తీరం దాటవచ్చని అచనచా వేస్తున్నారు. 

మిచౌంగ్ తీరానికి సమీపించడంతో కోస్తాతీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం కెరటాలతో విరుచుకుపడుతోంది. తుపాను ప్రబావంతో ఏపీ అంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, తిరుపతి , ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాత్రి నుంచి కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున కోస్తాతీరం వెంబడి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడనున్నాయి. 

ప్రస్తుతం మిచౌంగ్ తుపాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. మద్యాహ్నానికి బాపట్ల సమీపంలో తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవిచ్చారు. 

మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి-బిలాస్‌పూర్, తిరుపతి-విశాఖపట్నం తిరుచునాపల్లి ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు-న్యూటిన్యుకియా జంక్షన్ ఎక్స్‌ప్రెస్, ఎస్ఎంవీ బెంగళూరు-అగర్తల ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ప్రస్తుతం తుపాను ప్రభావం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా కన్పిస్తోంది. ఇవాళ తుపాను తీరం దాటనుండటంతో ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 

Alsor read: Cyclone Michoung: మిచౌంగ్ తుఫానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News