Botsa on Ammavodi: అలా ఉంటేనే అమ్మ ఒడి పథకం..మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ..!

Botsa on Ammavodi: ఏపీలో అమ్మ ఒడి పథకంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కావాలనే లబ్ధిదారులను తగ్గిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 23, 2022, 04:19 PM IST
  • అమ్మ ఒడి పథకంపై రాజకీయ దుమారం
  • లబ్ధిదారులను తగ్గిస్తున్నారని ప్రచారం
  • క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
Botsa on Ammavodi: అలా ఉంటేనే అమ్మ ఒడి పథకం..మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ..!

Botsa on Ammavodi: ఏపీలో అమ్మ ఒడి పథకంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కావాలనే లబ్ధిదారులను తగ్గిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలకు పంపిన పిల్లలకే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్కూళ్లకు వెళ్లకుండా అమ్మ ఒడి సొమ్ము రాలేదంటే ఎలా అని అన్నారు. అమ్మ ఒడి పథక లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తున్నారని అనడం అవాస్తవమన్నారు.

పిల్లలను బడికి పంపండి..అమ్మ ఒడి పథకాన్ని సద్వినియోగం చేసుకోండని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ స్థాయి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దతున్నామన్నారు. ఎవరైతే స్కూళ్లకు సక్రమంగా వెళ్తూ..75 శాతం హాజరు ఉండే వాళ్లకే అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సీఎం జగన్, అప్పటి విద్యా శాఖ మంత్రి అనేక సార్లు చెప్పారని..ఇదేమి కొత్త కాదన్నారు మంత్రి బొత్స. ఇప్పుడున్న విద్యా శాఖ మంత్రిగా తాను ఇదే మాటను చెబుతున్నానని తేల్చి చెప్పారు.

స్కూళ్లల్లో డ్రాప్‌ ఔట్స్ తగ్గించేందుకు ఈపథకం తీసుకొచ్చామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పథకం అమలుపై మార్గదర్శకాల్లోనూ ఇదే ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి అందిస్తామని తెలిపారు. నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నామన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. బైజూస్ ద్వారా ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు.

ఈఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. 2019 కంటే ఈసారి ఇంటర్ ఉత్తీర్ణత పెరిగిందని గుర్తు చేశారు. కోవిడ్ కారణంగా ఈసారి పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని..ఇప్పుడు మళ్లీ పరీక్షలు జరిగినా..ఇదే ఫలితం వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి బొత్స.

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాగం..రాగల మూడు రోజులపాటు వానలే..!

Also read:Film Federation: టాలీవుడ్‌లో రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు..సమ్మె విరమించిన కార్మికులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News