జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరేందుకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక దాదాపు సిద్ధమయ్యారు. తన ముఖ్య అనుచరులతో భేటీ అనంతరం టీడీపీలోకి చేరేందుకు మూహుర్తం కూడా ఖారారు చేసుకున్నట్లు తెలిసింది. రేపు, ఎల్లుండి ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఎంపీ రేణుక రాజీనామా చేసినట్లయితే ఆమెతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చేప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే జిల్లాలో వైసీపీకి గట్టి ఎదుదెబ్బ తగ్గినట్లుగా గానే భావించాలి.
ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడమే కారణం
వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు రేణుకను కాదని..వేరొకరికి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ పరిణామాలను గమనించిన సిట్టింగ్ ఎంపీ రేణుక .. గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. రేణుక విషయం తేల్చేందుకు వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం . స్పందించిన జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి నిరాకరించిన రేణుక తాను లోక్‌సభకే పోటీ చేస్తానని జగన్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీ వీడాలని రేణుక నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు కర్నూలు ఎంపీ సీటు రేణుకు ఇచ్చేందు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చినట్లు సమచారం.
చంద్రబాబు భరోసాతో టీడీపీలోకి రేణుక ?