MP Uday Srinivas Vs MLA Konda Babu: కాకినాడ కూటమి సర్కార్‌లో కూటమి సర్కార్‌లో కుమ్ములాటలు మరోసారి బట్టబయలయ్యాయి. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్- ఎమ్మెల్యే కొండ బాబు మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. జిల్లా కేంద్రంలో ఆధిపత్యం కోసం ఓ వైపు ఎంపీ వర్గం ప్రయత్నిస్తుండగా.. ఎమ్మెల్యే వర్గం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది. కాకినాడలో ఓ వైన్స్ షాపు విషయంలో తలెత్తిన వివాదం ఇప్పుడు నువ్వానేనా అనే స్థితికి చేరుకుంది. దీనికి తోడు దమ్ముల పేటలో దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే వర్గం ఎంపీ ఫొటో ఫ్లెక్సీలో పెట్టకపోవడం మరింత రచ్చ రాజేసింది. ఈ రెండు ఘటనలతో కూటమి పార్టీలో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
Also Read: Naga Chaitanya: నాగ చైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడా.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసా..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలన నడుస్తోంది. అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, పి గన్నవరం, రాజోలుతో కలపి మొత్తం ఆరు స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఇక అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. మిగిలిన 12 స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఇక మూడు ఎంపీ స్థానాలకు గానూ కాకినాడ జనసేనకు, రాజమండ్రి బిజెపికి, అమలాపురం తెలుగుదేశంకు కేటాయించారు ఆ ముగ్గురు గెలిచారు. అయితే కాకినాడ జిల్లాలో మాత్రం కూటమి నేతల మధ్య అంతర్గత పోరు కొద్దిరోజులుగా డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. మూడు పార్టీల నేతల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. కూటమి సర్కార్‌లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. అక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న SVSN వర్మకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నెరవేరలేదు. ఓ విధంగా చెప్పాలంటే వర్మను తొక్కేస్తున్నారనే ప్రచారముంది. వర్మకు పదవి విషయంలో సీఎం చంద్రబాబుకు జోక్యం చేసుకోవడం లేదని అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే పిఠాపురం రాజకీయాలన్నీ పవన్ కల్యాణ్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దాంతో పిఠాపురంలో టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మ కొత్త రాజకీయాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కత తన ఉనికికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
తాజాగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ టీడీపీ సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కాకినాడలో ఓ మద్యం షాపుకు సంబంధించి తెలుగుదేశం నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కు కుడి భుజంగా ఉంటున్న మల్లిపూడి వీరు షాపు ప్రారంభోత్సవానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆ షాపును ఎంపీ అనుచరులు తీసుకున్నారు. ఎంపీ అనుచరులను కాదని ఎమ్మెల్యే అనుచరులు ఆ షాపు పెట్టుకోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది సరిపోదు అన్నట్లు బాణాసంచా షాపుల వ్యవహారం వివాదం మరింత అగ్గి రాజేసింది. దీపావళి రాకుండానే వీరి మధ్య బాణాసంచా పేలింది. కాకినాడ మెయిన్ రోడ్ లో టిడిపి, జనసేన రెండు షాపులు పెట్టుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అయితే జనావాసాల మధ్య మెయిన్ రోడ్డులో ఈ షాపుల ప్రతిపాదన రావడంతో అక్కడ షాపులు పెట్టడానికి లేదని ఎంపీ ఉదయ శ్రీనివాస్ సూచించారు. అధికారులు ఇది పరిగణలోకి తీసుకున్నారు. అక్కడ అనుమతి ఇవ్వలేదు. దాంతో ఎంపీ
మొత్తంగా కాకినాడలో ఎంపీ ఉదయ శ్రీనివాస్ కూటమి పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు బాణాసంచా షాపు రాకుండా అడ్డుకున్నారంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్షం తరహాలో రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. కాకినాడ ఆర్డీవో కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఉదయ్ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలు పోలేదు. ధర్నా ప్రతిపక్షాలు చేస్తే వారిని ఈడ్చి పడేసే వారు పోలీసులు. కానీ అధికార పార్టీ ధర్నా చేయడంతో వారికి పహారా కాసారు తప్ప కనీసం సద్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. మొత్తం 24 గంటలకు పైగా హై డ్రామా నడిచింది. ఎంపీ ఉదయ శ్రీనివాస్ చెప్పిందే జరిగింది.
అక్కడ షాపులకు అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్యే అనుచరులు ఓడిపోయారు. ఎంపీ గెలిచారు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు. బాణాసంచా వివాదం మరింత రాజుకుంది. అధికార పార్టీ నాయకులే రోడ్డెక్కి ధర్నా చేయడం ప్రతిపక్షాలే కాదు ప్రజలే తప్పుపట్టారు. ఇప్పటికైనా రెండు పార్టీల అధినేతలు జోక్యం చేసుకోకపోతే పార్లమెంట్ మొత్తం ఈ విభేదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నాయని రెండు పార్టీల సీనియర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter