Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. బాలకృష్ణ రియాక్షన్..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు అరెస్టు విమక్షాలు ఖండిస్తున్నా తరుణంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 01:03 PM IST
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. బాలకృష్ణ రియాక్షన్..!

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ మరియు 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) కేసు నమోదు చేశారు. 

తెలుగుదేశం కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అరెస్టు ఖండిస్తున్నారు. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు..? స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.

Also Read: Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, కేసు పరిణామాలిలా

ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదు..? డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా..?  మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారు.

జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు? ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ తెలుపారు.  

Also Read: handrababu Arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రవ్యాప్తంగా బస్సులకు బ్రేక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News