Nara Rohit: తండ్రి పార్థవదేహాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్.. పక్కనే అన్న కూడా..వీడియో వైరల్..!

Nara Rammurthy Naidu:తాజాగా నారా రోహిత్ రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈయన అంత్యక్రియలు నారావారి పల్లెలో లాంచనంగా జరిగాయి. తండ్రి పార్థివ దేహాన్ని చూసి నారా రోహిత్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya | Last Updated : Nov 17, 2024, 02:35 PM IST
Nara Rohit: తండ్రి పార్థవదేహాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్.. పక్కనే అన్న కూడా..వీడియో వైరల్..!

Nara Rohit father cremation video: హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి , ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమ్ముడు, టిడిపి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో చికిత్స తీసుకుంటూ స్వర్గస్తులయ్యారు. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా చికిత్స సమయంలో గుండెపోటు రావడంతోనే రామ్మూర్తి కన్నుమూసినట్లు సమాచారం. అయితే రామ్మూర్తి మరణం ఆయన బంధువులతో పాటు రాజకీయ అభిమానులకి కూడా తీవ్రో శోకాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు కూడా హుటాహుటిన తమ్ముడు మరణించారన్న వార్త తెలిసి ఇంటికి చేరుకున్నారు. 

ఇదిలా ఉండగా నారా రోహిత్ తండ్రి మరణాన్ని విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  ఇక తండ్రి లేడన్న విషయాన్ని తట్టుకోలేక సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ కూడా చేశాడు. నువ్వు ఒక గొప్ప ఫైటర్ వి నాన్న. నువ్వు నా మీద చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించావు. 

నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే అది నీ వల్లే. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించావు. నీ జీవితం లో మా కోసం ఎన్నో దూరం చేసుకున్నావు. నువ్వు చేసిన త్యాగాలే మా జీవితాలలో ఒక వెలుగు నింపాయి నిన్ను చాలా మిస్ అవుతున్నాం నాన్న అంటూ పోస్ట్ చేశారు నారా రోహిత్. 

ఇకపోతే నారావారి పల్లెలో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతూ ఉండగా.. వెక్కివెక్కి ఏడ్చి అందరిని ఏడిపించారు నారా రోహిత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RTV News (@rtvnewsnetwork)

Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News