Nethanna hastam, Vidyakanuka and Agri gold victims: అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రూ. 20 వేలులోపు డిపాజిట్ చేసిన అగ్రి గోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేయనున్నట్లు చెప్పారు. 20 వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసి మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం కానుంది. ఇక అంతకంటే ముందుగా చేనేత కార్మికుల కోసం ఆగస్టు 10న నేతన్న హస్తం, ఆ తర్వాత ఆగస్టు 16న పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా విద్యాకానుక అందజేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఆగస్టు 27న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఇన్సెంటివ్స్ అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
పర్ఫార్మెన్స్ బాగా లేనివారికి మెమోలు జారీ:
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (Grama sachivalayam, ward sachivalayam) పనితీరును క్షేత్రస్థాయిలో సందర్శించి తనిఖీలు జరపాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan video conference) నిర్వహించిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారుల గైర్హాజరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also read: Corona Vaccine for Children: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఆగస్టు నుంచే
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై మండిపడిన సీఎం జగన్.. పర్ఫార్మెన్స్ బాగా లేనివారికి మెమోలు జారీచేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. వారంలో నాలుగుసార్లు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సందర్శించాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని అధికారులను నిలదీశారు.
Ration, pension cards, House patta, Aarogyasri scheme -రేషన్ బియ్యం, పెన్షన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలుపై ఫోకస్:
రేషన్ బియ్యం, పెన్షన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు నిర్దేశించుకున్న గుడువులోగా అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలు విషయంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని సీఎం జగన్ (CM YS Jagan) అధికారులకు హితవు పలికారు.
Also read : RS Praveen Kumar to join BSP: బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్ కుమార్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Agri gold victims: అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ.. సీఎం జగన్ గుడ్ న్యూస్